top of page
micci .png

About MICCI in Telugu

MICCI అంటే Madiga Industrial Chambers of Commerce, Industry.

మాదిగల ఆర్థికాభివృద్ధికి కృషి చేసే సంస్థ. మాదిగ వ్యాపార పారిశ్రామికవేత్తల సంఘాము

MICCI లక్ష్యాలు:

భారతదేశంలోని ప్రతి మాదిగ ఆర్థిక అభివృద్దే లక్ష్యం. మాదిగ యువతను పారిశ్రామిక వెత్తలుగా వ్యాపార మరియు పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించడానికి మరియు వారి సొంతస్థానాన్ని ఏర్పరచుకోవాడానికి ప్రోత్సహించడము. మాదిగ వ్యాపార నాయకత్వాన్ని అభివృద్ధి చేయడము.

మాదిగలు ఉద్యోగాల కోసం వెతికే వారిగా కాకుండా,ఉద్యోగాలు ఇచ్చే వారిగా తీర్చిదిద్దడము.

స్వయం సహయ(Self Help)వ్యవస్థాపకత(Entrepreneurship) ద్వారా ఆర్ధిక సాధికారత గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలలను సాకారం చేయడానికి కృషి చేయడము.

MICCI సిద్ధాంతము:

ప్రతి మనిషి ఎదుగుదలతో వారి ప్రవర్తన, స్వభావం ఎంత ముఖ్యమో వారు బ్రతకడానికి ఆర్థిక స్వాతంత్రం కూడా అంతే ముఖ్యం. మనిషి తన జీవన విధానాన్ని కొనసాగించే క్రమంలో, ప్రతి విషయంలో డబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పేదవారిగా పుట్టడం తప్పుకాదు కాని, పేదవారిగ చచ్చిపోవడం మాత్రం ఖచ్చితంగే తప్పే” ఏ రంగంలో రాణించాలన్నా ముందు ఆర్థిక రంగంలో రాణించాలి Economic Power Is The First Master Key- Mahesh Gogorla

MICCI ఆవశ్యకత:

మాదిగలకు ప్రపంచంలోనే మొట్ట మొదట పారిశ్రామికవెత్తలు వ్యాపారవెత్తలు మానవుడు నడవడానికి చెప్పులు తప్పనిసరి అని గుర్తుంచి మొట్టమొదట చెప్పుల పరిశ్రమ పెట్టి చెప్పులు తయారు చెసింది మాదిగనే. ఈ చెప్పున పరిశ్రమల ద్వారా సంవత్సరానికి అయ్యే వ్యాపారం ఒక భారత దేశంలోనే దాదాపు 140 కోట్ల జనాభా ఒక్కొకరికి ఒక జత చెప్పులు సుమారు 100 రూపాయలు అంటే 14000 వేల కోట్ల రూపాయల వ్యాపారం, మరీ నెలకు నెలకు 1168 కోట్లు రోజుకి 40 కోట్ల వ్యాపారం తెలంగాణ జనాభా 4 కోట్లు అయితే రూ “100=400 కోట్లు సంవత్సరానికి మరీ నెలకు 34 కోట్లు రోజుకి 1 కోటి 30 లక్షల.
వ్యాపారం ఇది కేవలం ఒక సగటు మనిషి దాదాపు సంవత్సరానికి ఒక జత చెప్పులు ఖర్చు మాత్రమే లెక్క పెట్టాము కాని. 
ఇప్పుడు లెదర్ తో కేవలం చెప్పులు మాత్రమే కాదు బూట్లు, బెల్టులు, బ్యాగ్ పర్సులు మరి ఎన్నో రకాలు, అన్ని లెక్క పెడితే రోజుకి కొన్ని వందల కోట్లతో వ్యాపారం అయినప్పటికి ఆ లెదర్ పరిశ్రమను స్థాపించిన మాదిగలు మాత్రం ఆర్ధికంగా అట్టడుగున ఉన్నారు.

ప్రపంచీకరణ, ప్రవేటీకరణ, పట్టణీకరణ కారణంగా ఎంతో మంది నిరుద్యోగులుగా ఉండటము.

సరైన ఉపాధి అవకాశాలు/ జాబ్స్ నోటిఫికేషన్ లేక ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగంతో బాధపడటము.రోజురోజుకి పెరుగుతున్న ప్రవేటీకరణ కారణంగా, ఉన్న ఉద్యోగులలో ఆసురక్షిత స్థానం పెరుగుటము ముందు ముందు జరిగే ప్రవేటీకరణలో రిజిస్ట్రేషన్లు ఉండవు అని గుర్తించడము.

కరుణ మహమ్మారి వలన వ్యాపారాల్లో నష్టపోతున్న మరియు ఉద్యోగాలు కోల్పోతున్న మాదిగ కుటుంబాలకు ఆర్థిక అంశాల పైన వ్యాపార అంశాల పైన అవగాహన కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వడము వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పటము. జనాభాలో అత్యధికంగా ఉన్న మాదిగలు ఆర్థికాభివృద్ధిలో మాత్రం అట్టడుగున ఉన్నారు ఆర్థికంగా లేకపోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాలలో వెనుకబడుతున్నారు. ఏ రంగంలో రాణించాలన్న ముందు ఆర్థిక రంగంలో రాణించాలి.

ప్రాథమికంగా కాని, చారిత్రకంగా కాని మాదిగలు మొట్ట మొదటి పారిశ్రామిక వెత్తలు, ఆ కీర్తిని మనం తప్పక తిరిగి సంపాదించుకోవాలి, మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. ఇవన్ని కేవలం ఒక ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి సంస్థ (Self Center for Madigas Economic Development) ఏర్పాటు ద్వారా మాత్రమే సాధ్యమని భావించి శ్రీ మహేష్ గోగర్ల గారు MICCI సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగలు ఏ ప్రాంతంలో ఉన్న ఏ పార్టీలో ఉన్న ఏ రంగంలో ఉన్న ఏ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా MICCI పనిచేస్తుంది.

MICCI కార్యకళాపాలు:

మాదిగ పారిశ్రామిక వ్యాపారవెత్తలందర్ని అందర్నీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడము.

శిక్షణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వ్యాపార అవకాశాలపైన అవగాహన కార్యక్రమాలు వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించడము. మాదిగల సామాజిక ఆర్థిక సమస్యలకు పరిష్కారంగా వారిలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడము. వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి అభివృద్ధి చేయడానికి ఒక సలహాదారునిగా కో-ఆర్డినేటర్ గా, మార్గదర్శకుడిగా MICCI వ్యవహరిస్తుంది.

ఇప్పటికీ ఉన్న మరియు ఔత్సహిక స్థానిక (Up Coming) పారిశ్రామిక వెత్తలకు One Stop Resource Center గా పని చేయడము.

Telugu_1.webp
bottom of page